జాతీయ వార్తలు

నేషనల్ హెరాల్డ్ కేసు.. సాక్ష్యాలన్నీ సమర్పిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆయన కుమారుడు రాహుల్ గాంధీకి, మరో అయిదుగురికి వ్యతిరేకంగా సాక్ష్యాల మొత్తం జాబితాను సమర్పిస్తానని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గురువారం కోర్టుకు తెలిపారు. కొంతమంది నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు తన ఆదేశాలను జారీ చేసిన వెంటనే ఈ జాబితాను సమర్పిస్తానని ఆయన కోర్టుకు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను, ఇతర ఏజన్సీలను, అలాగే 2010-11 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌ను సమర్పించాలని కాంగ్రెస్ పార్టీని ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ నిందితుల్లో కొంతమంది దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును గత నెల 18న వాయిదా వేసింది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులు కేవలం 50 లక్షలు చెల్లించి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారని, ఫలితంగా ఆ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంగ్రెస్ పార్టీకి బకాయి పడిన రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును వారు ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంపాదించుకుందని సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపించారు. ఈ కేసులో యంగ్ ఇండియా సంస్థతోపాటుగా సోనియా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాలకు నిందితులుగా కోర్టు 2014 జూన్ 26న సమన్లు జారీ చేసింది. అయితే వారు తమపై మోపిన అన్ని ఆరోపణలను ఖండించారు.
కాగా, తాను హైకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నట్లు ఈ రోజు విచారణ సందర్భంగా స్వామి చెప్పారు. ‘హైకోర్టు తీర్పు ఏమిటో తెలిసిన వెంటనే నేను సాక్ష్యాధారాల పూర్తి జాబితాను సమర్పిస్తాను. అప్పుడు అంతాకూడా కొనసాగింపుగా మారుతుంది’ అని ఆయన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లలీన్‌కు చెప్పారు. ట్రయల్ కోర్టు జనవరి 11, మార్చి 11న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై హైకోర్టు తన తీర్పును ప్రకటించనున్నట్లు నిందితుల్లో ఒకరి తరఫున హాజరయిన సీనియర్ న్యాయవాది ఆర్‌ఎస్ చీమా చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసుకున్న పిటిషన్లపై ట్రయల్ కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.