జాతీయ వార్తలు

పైసా కూడా ఆపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేయగలిగినంత సాయం చేస్తుందని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రతి పైసా అలాగే పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రుణం ఇప్పిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2015-16 బడ్జెట్‌పై జరిగిన చర్చకు బదులిస్తూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. విభజన వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జైట్లీ ప్రసంగంలో ఎక్కడా ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌కు 98 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిందని, ఆంధ్రప్రదేశ్ అప్పుడే విభజించి ఉంటే ఆంధ్రాకు 52 వేల కోట్లు, తెలంగాణకు 48 వేల కోట్లు లభించి ఉండేవన్నారు. 2014-15లో పన్నుల వాటా కింద 14,100 కోట్లుఇచ్చామన్నారు. 2015-16 సంవత్సరంలో 21, 900 కోట్లు ఇచ్చామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఏపి ఆదాయ లోటు భర్తీకి 6,609 కోట్లు, స్థానిక సంస్థలకు 1259 కోట్లు విభజన చట్టం ప్రకారం ఇవ్వవలసి ఉందని ఆయన పేర్కొన్నారు. ఏపికి మొదట సంవత్సరం రెవెన్యూ లోటు 13 వేల కోట్లు కాగా ఇంత వరకు 2, 800 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు వెల్లడించారు. ‘కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి 2015 కోట్ల రూపాయలు ఇచ్చాం. మరిన్ని నిధులు ఇస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్ నుంచి రుణ సదుపాయం కల్పిస్తాం. ప్రాజెక్టును పూర్తిచేస్తాం’ ఆర్థిక మంత్రి వివరించారు. విభజన వల్ల ఏపి తీవ్రంగా నష్టపోయిందని జైట్లీ అంగీకరించారు.
ఒడిశా ఎంపీల గొడవ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్ నుంచి పెద్దఎత్తున రుణాలు మంజూరు చేయిస్తామని జైట్లీ ప్రకటించగానే ఒడిశాకు చెందిన బిజెడి ఎంపీలు లేచి తీవ్ర నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తాము దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణలో ఉండగా రుణ సదుపాయం కల్పిస్తామని మంత్రి ఎలా హామీ ఇస్తారని వారు నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎంపీలు గొడవకు దిగారు. అయితే విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవటమే తమ ఉదేశమని జైట్లీ బదులిచ్చారు. ఏపిలో కొన్ని జిల్లాలు బాగా వెనకబడి ఉన్నాయని మంత్రి తెలిపారు. అయినా బిజెడి ఎంపిలు ఆందోళన విరమించలేదు. ఈ దశలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఎంపీల వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జైట్లీ ప్రకటనకు నిరసనగా బిజెడి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.