జాతీయ వార్తలు

పుష్పగుచ్ఛాలు వద్దు.. పుస్తకాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, జూన్ 17: జ్ఞానం కేవలం చదువుకే పరిమితం కాకూడదని, దాని అసలైన లక్ష్యం సామాజిక, ఆర్థిక మార్పును తీసు కు రావడంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఇక్కడ పిఎన్ పనిక్కర్ ఫౌండేషన్ నెల రోజు లపాటు చేపట్టిన ‘రీడింగ్ మంత్’ కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి జ్ఞానం పునాదులపైనే మెరుగైన సమాజం అనే బృహత్ నిర్మా ణం ఏర్పడుతుందని అన్నా రు. చదువు అసలు లక్ష్యం సమాజంలో ఆర్థిక, సామాజిక అభివృద్దిని తీసు కురావడంగా ఉండాలని, పనిక్కర్ ఫౌండేషన్ ఆ దిశగా కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ‘చదువుకన్నా గొప్ప ఆనందం మరోటి లేదు. జ్ఞానంకన్నా గొప్ప స్నేహితుడు లేడు’ అని, నేటి యువతరం చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని, ఇతరులను అందుకు ప్రోత్సహించాలని అన్నారు. మెరుగైన సమాజాన్ని, దేశాన్ని తయా రుచేసే శక్తి యువతకే ఉందని అన్నారు. మర్యాదపూర్వకంగా స్నేహితులు, పెద్దలను కలిసేటప్పుడు బొకేకు బదులుగా ఒక పుస్తకాన్ని ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. విద్య, అక్షరాస్యత విషయంలో కేరళ సాధించిన విజయాలను ఆయన ప్రశంసిస్తూ, ఈ విషయంలో కేరళ రాష్ట్రం దేశానికే మార్గదర్శకం, ఆదర్శమని అన్నా రు. ప్రాథమిక విద్యలో వందశాతం అక్షరాస్యతను సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించిందని ఆయన అంటూ విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజ యం కేవలం రాష్ట్ర ప్రభు త్వం వల్లనే రాలేదని, రాష్ట్ర ప్రజలు, సామాజిక సంస్థలు ఎంతో చురుకైనపాత్ర పోషించాయని అన్నారు. ఓ మహిళ విద్యావంతురాలయితే రెండు కుటుంబాలు బాగుపడతాయని అంటారని, అయితే తాను మాత్రం రెండు తరాలు బాగు పడతాయని అంటానని ప్రధాని అన్నారు. ‘కేరళ గ్రంథశాల సంఘం’ ద్వారా రాష్ట్రంలో గ్రంథాలయాల వ్యాప్తి విస్తరించడానికి పనిక్కర్ ఒక చోదక శక్తిగా మారారని ఆయన అన్నారు.

చిత్రం.. శనివారం కొచ్చిలో మంత్రులతో సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్