జాతీయ వార్తలు

పోలవరానికి పూర్తిఖర్చు మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రకటించారు. ఉమాభారతి గురువారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని హామీ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దానికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డ్ నుంచి రుణం తీసుకుంటామని ఉమాభారతి స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాతనే పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేశామని వెల్లడించారు.