జాతీయ వార్తలు

ఆర్కేనగర్ ఉపఎన్నిక వ్యవహారంలో పళనిస్వామి, దినకరన్‌లపై ఎఫ్‌ఐఆర్‌కు ఇసి ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 18: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పం చారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రం లో అధికార అన్నాడిఎంకే మెడకు చుట్టు కుంటున్నాయ. ఇందుకు సం బంధించి అన్నివివరాలు సేకరించన ఎన్నికల కమిషన్ ఆదివారం తీవ్రంగా స్పం దించింది ఈవ్యవహారంలో తప్పు చేసిన వారిని వదలకూడదని ఆదేశిం చింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌ను పురస్కరించుకుని అన్నాడిఎంకె నేతలు దినకరన్, ముఖ్యమంత్రి పళనిస్వామి, విజయభాస్కర్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఉపఎన్నిక సందర్భగా భారీ ఎత్తున డబ్బులు పంచారన్న ఆరోపణలకు సంబంధించి తమకు ఆదాయం పన్ను విభాగం నుంచి నివేదికలు అందాయని పేర్కొన్న ఎన్నికల కమిషన్ భారత శిక్షాస్మృతిలోని 171బి సెక్షన్ కింద ఇది నేరమని తెలిపింది. ఈ వ్యవహారంలో ఎలాంటి జాప్యం లేకుం డా సత్వర చర్య తీసుకోవాలని తెలిపిం ది. ఇప్పటికే పార్టీచీలక వ్యవ హారంలో కొట్టుమిట్టాడుతున్న అన్నాడిఎంకే నేతలను ఎన్నికమిషన్ తాజా నిర్ణయం మరింత ఇరుకున పెట్టింది.