జాతీయ వార్తలు

విద్యుత్ నుంచి వైఫై వరకూ.. అమ్మ వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరుందురై, మే 5: వరుసగా రెండోసారీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార అన్నాడిఎంకె అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గురువారం హద్దుల్లేని వరాల వర్షమే కురిపించారు. మరో పదిరోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేసిన జయ వరాల మూటనే వెదజల్లారు. తమ పార్టీకి మళ్లీ పట్టం కడితే రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరికీ ఉచిత సెల్‌ఫోన్లు, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, బహిరంగ ప్రదేశాల్లో వైఫై సౌకర్యం కల్పిస్తామని హామీలిచ్చారు. ఇందుకు సంబంధించిన పార్టీ ఎన్నికల ప్రణాళికను ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో జయ ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, డిఎంకె అధినేత కరుణానిధి ర్యాలీలు నిర్వహించిన రోజునే జయ ఈ వాగ్దానాల పరంపరను సంధించడం గమనార్హం. వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగమూ కల్పిస్తామని జయ తెలిపారు. పదకొండు, పనె్నండో తరగతి విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్, ఇంటర్‌నెంట్ కనెక్షన్‌నూ అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రసూతి పథకం కింద ఇస్తున్న సహాయాన్ని 12వేల నుంచి 18వేలకు పెంచుతామని, మంగళ సూత్రానికి ఇచ్చే బంగారాన్ని నాలుగు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాములకు పెంచుతామనీ జయ వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించే కోఆప్టెక్స్ నుంచి సంక్రాతి సమయంలో దుస్తులు కొనేందుకు 500రూపాయల కూపన్‌లూ ఇస్తామని తెలిపారు.

chitram పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న జయ