జాతీయ వార్తలు

వాళ్ల టార్గెట్ ‘రైతు విముక్త భారత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అమలుచేస్తోందని కాంగ్రెస్ విరుచుకుపడింది. కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు విముక్త భారత్‌కోసం చేయాల్సిందంతా చేస్తున్నాయని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలో ఇక రైతులనే లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టున్నారని సింధియా ఎద్దేవా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులను ఉద్ధరిస్తామని చెప్పిన బిజెపి అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గిట్టుబాటు ధర హామీ ఏమైందని సింధియా నిలదీశారు. రైతులను ఆదుకోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. కనీస మద్దతు ధరకోసం దీక్ష చేస్తున్న రైతులపై కాల్పులు జరిపించి ఆరుగురు రైతుల ప్రాణాలు తీశారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై నిప్పులు చెరిగారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి ఒక్కో విధానాన్ని అమలుచేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్టల్రో రైతులకు రుణమాఫీ అమలుచేస్తూ మధ్యప్రదేశ్‌లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని సింధియా విమర్శించారు. రైతుల మృతికి కారణమైన పోలీసు అధికారిపై హత్య కేసు నమోదు చేయాలని శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు మేలుచేస్తూ సామాన్యులు, రైతులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ వౌనం వహించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రైతులపట్ల మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణ చూస్తుంటే ‘కిసాన్ ముక్త భారత్’ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు భావించాల్సి వస్తోందని మాజీ కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.