జాతీయ వార్తలు

ప్రతిపక్షాల సూచనల మేరకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్ధి రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికకు పోటీలేకుండా ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం వెంకయ్య నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ రాష్టప్రతి అభ్యర్థిత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌ద్వారా చర్చలు జరిపినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రా, తెలంగాణ, బిహార్, తమిళనాడు ముఖ్యమంత్రులతో రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలపాలని కోరినట్టు చెప్పారు. రాష్టప్రతి ఎంపిక విషయంలో బిజెపి వేసిన కమిటీ ప్రతిపక్షాల నాయకులను సంప్రదించినప్పుడు వారు స్థూలంగా కొన్ని సూచనలు చేసినట్టు చెప్పారు. విపక్ష పార్టీ నాయకుల సూచనలు మేరకు నిజాయితీపరుడు, విద్యావంతుడు, వివాద రహితుడైన ప్రస్తుత బిహర్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించినట్టు చెప్పారు.