జాతీయ వార్తలు

కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను అదుపుచేసేందుకు ఉద్దేశించిన ‘ది క్లీనికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజిష్ట్రైషన్ అండ్ రెగ్యులేషన్ ) 2010 చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. ఖాన్ గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న దోపిడీ గురించి ప్రస్తావించారు. కార్పొరేట్ ఆసుత్రులు దోపిడీని అదుపుచేసేందుకు ఏర్పాటైన ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అమలు చేస్తే ప్రత్యేకంగా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయవలసి అవసరం కూడా ఉండదని ఖాన్ స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి భూమిని తీసుకునే సమయంలో దాదాపు 40 శాతం మంది పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందజేస్తామని ఒప్పుకుని, ఆసుపత్రి ప్రారంభమైన తరువాత దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రులు సిజిహెచ్‌ఎస్ కార్డును కూడా గుర్తించటం లేదని ఆయన విమర్శించారు. కార్పొరేట్ ఆసుపత్రులను దారిలోకి తీసుకురావాలంటే 2010లో చేసిన చట్టాన్ని తు.చ.తప్పకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్లీనికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం కూడా అమలు చేయకపోవటం దారుణమని ఆయన ఆవేదన చెందారు.