జాతీయ వార్తలు

త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: మరణశిక్షలను ఎదుర్కొంటున్న దోషులు న్యాయపరంగా తమకున్న అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత కూడా తమను ఉరి తీయడాన్ని సవాలు చేస్తూ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా లేదా అనే అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. తమను ఉరి తీయడాన్ని నిలిపివేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన బాబు అలియాస్ కేతన్, సన్ని అలియాస్ దేవేంద్ర దాఖలు చేసిన పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత విచారించాలని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎస్‌కె కౌల్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ నిర్ణయించింది. నిందితుల క్షమాబిక్ష పిటిషన్లను రాష్టప్రతి ప్రణబ్ గత నెల 25న తిరస్కరించారని, ఏ సమయంలోనైనా డెత్ వారెంట్లు జారీ చేయవచ్చని నిందితుల తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ అంటూ వారి పిటిషన్‌ను సత్వరం విచారించాలని కోరారు. నాలుగేళ్ల బాలికను రేప్ చేసి చంపినందుకు బాబు అలియాస్ కేతన్, సన్నీ అలియాస్ దేవేంద్రతో పాటుగా మరో వ్యక్తికి ఇండోర్ కోర్టు ఉరిశిక్ష విధించింది.