జాతీయ వార్తలు

విపక్షానిదీ దళిత అస్తమ్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: దళిత నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను తమ అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రతిపక్షం నిర్ణయించటతో కొత్త రాష్టప్రతి ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. దళిత నాయకుడైన రామ్‌నాథ్ కోవింద్‌పై మరో దళిత నాయకురాలు మీరాకుమార్ పోటీకి దిగటం తో కొత్త రాష్టప్రతి ఎన్నిక రసకందాయంలో పడింది. రామ్‌నాథ్ కోవింద్‌ను బరిలోకి దించటంద్వారా ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వేసిన ఎత్తుగడను దెబ్బతీసేందుకే మహాదళిత్ అయిన మీరాకుమార్‌ను ప్రతిపక్షం రంగంలోకి దించింది. తద్వారా ప్రతిపక్షంలోని దళిత ఎంపీలు బిజెపి అభ్యర్థికి ఓటు వేయకుండా జాగ్రత్తపడ్డారు. మీరాకుమార్‌ను రంగంలోకి దించటం ద్వారా ప్రతిపక్షం తమ సమైక్యతను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. రాష్టప్రతి పదవికి ప్రతిపక్షం అభ్యర్థిగా మీరాకుమార్ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. సోనియా అధ్యక్షతన గురువారం పార్లమెంటు ఆవరణలో జరిగిన పదిహేడు ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మీరాకుమార్‌ను రాష్టప్రతి అభ్యర్థిగా రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. ప్రతిపక్షం సమావేశానికి జెడి(యు)తోపాటు ఎస్‌పి, బిఎస్‌పి పార్టీల సీనియర్ నాయకులు ఎందుకు హాజరు కాలేదనే
ప్రశ్నకు గులాం నబీ ఆజాద్ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. ప్రతిపక్షం సమావేశానికి గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాజ్యసభలో టిఎంసి సీనియర్ నాయకుడు డెర్రిక్ ఒబ్రేన్, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కార్యదర్శి డి.రాజా, ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్, సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్, ఆర్‌జెడి అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, డిఎంకె నాయకురాలు కనిమోళి, రాజ్యసభలో ఎస్‌పి పక్షం నాయకుడు రాంగోపాల్ యాదవ్, బిఎస్‌పి నాయకుడు మిశ్రా తదితరులు హాజరయ్యారు. అయితే రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించిన జెడి(యు) ఈ సమావేశానికి హాజరుకాలేదు. ప్రతిపక్షం సమావేశంలో మొదట రాష్టప్రతి పదవికి అభ్యర్థిని రంగంలోకి దించాలా వద్దా అనే అంశంపై చర్చ జరిగింది. అధికార పక్షం తమ అభ్యర్థి పేరు వెల్లడించకుండానే ప్రతిపక్షం సహకారాన్ని కోరటం రాజకీయ అనైతికత అని పలువురు నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. రామ్‌నాధ్ కోవింద్‌కు ప్రతిగా తమ అభ్యర్థిని రంగంలోకి దించకపోతే ప్రతిపక్షం ప్రతిష్ట దెబ్బతింటుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. అనంతరం ఎవరిని పోటీకి పెడితే బాగుంటుందనే అంశంపై చర్చ జరిగింది. మీరాకుమార్‌తో పాటు దళితనేతలైన సుశీల్ కుమార్ షిండే, బాలచంద్ర మునే్గకర్‌ల పేర్లూ పరిశీలనకు వచ్చాయి. మీరాకుమార్‌నే పోటీకి దించాలంటూ అన్ని పార్టీలు ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆమోద ముద్ర వేశారు. ఇంతకు ముందు అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ పేరును ప్రతిపాదించినా ఎవరి మద్దతూ లభించలేదు. బుధవారం సాయంత్రం సోనియా గాంధీ నివాసానికి వెళ్లి రాష్టప్రతి ఎన్నికల అంశంపై మీరా కుమార్ చర్చించారు.