జాతీయ వార్తలు

నేడే కార్టోశాట్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 22: భారీ ప్రయోగాలు చేపడుతూ ప్రపంచ దృష్టి మనపై తిప్పుకున్న ఇస్రో మరో రికార్టు ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. మరో కొన్ని గంటల వ్యవధిలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)చరితాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఒకే రాకెట్ ద్వారా మరోసారి 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. నెల్లూరు
జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9గంటల 29నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం కార్టోశాట్-2ఇ ఉపగ్రహం, చెన్నై యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన చిన్న ఉపగ్రహంతోపాటు 14దేశాలకు చెందిన మరో 29 నానో ఉపగ్రహాలు కలిపి మొత్తం 31 ఉపగ్రహాలను ఒకేసారి రోదసీలోకి పంపనున్నారు.