జాతీయ వార్తలు

మధ్యవర్తిత్వం అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. దీనిపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) మధ్యవర్తిత్వం అక్కర్లేదని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఐరాస ఏమైనా చేయాలనుకుంటే జిహాద్ పేరుతో పాకిస్తాన్ భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించకుండా చూస్తే చాలని పేర్కొన్నారు. బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటెరస్ మాట్లాడుతూ ఇటీవల భారత్, పాక్ ప్రధానులతో తాను సమావేశమయ్యానని, ఇరుదేశాల మధ్య రగులుతున్న కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం నెరపితే బాగుంటుందని పేర్కొనడంపై స్పందిస్తూ సుబ్రహ్మణ్య స్వామి గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఇక్కడి సమస్యపై ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదని ఘాటుగా స్పందించారు. భారత ప్రభుత్వం ఎవరినీ కాశ్మీర్‌లో బలవంతంగా ఉండమని చెప్పలేదని, ఇష్టం లేనివారు దేశాన్ని ఎప్పుడైనా వదిలి వెళ్లవచ్చని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించడం పట్ల సంబరాలు జరుపుకుని మాతృ దేశాన్ని అవమానించారని, పాక్‌పై అంత ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లి పోవచ్చని పేర్కొన్నారు. దేశ వ్యతిరేకులు, దేశ ఔన్నత్యాన్ని తక్కువ చేసినవారి పౌరసత్వాన్ని చట్ట ప్రకారం రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, అలా చేయకముందే వారు దేశాన్ని వదిలిపోవడం మంచిదని అన్నారు. పాకిస్తాన్ విజయంపై ఆనందోత్సవాలు జరుపుకున్నవాళ్లు భారత్‌ను విడిచి వెళ్లాలని జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ సయ్యద్ ఘయోరల్ హసన్ రిజ్వి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి సమర్థించారు.