జాతీయ వార్తలు

రాజ్యాంగ బద్ధం, రాజకీయాలకు అతీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు సహా పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతల సమక్షంలో రాష్టప్రతి పదవికి ఎన్డీయే ఉమ్మడి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కోవింద్ ఎలాంటి మచ్చ లేని నాయకుడని, అన్ని విధాలుగా ఈ రాజ్యాంగ పదవికి సమర్థుడని నేతలు అభివర్ణించారు. నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడిన కోవింద్ రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తానని తెలిపారు. రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధిగా పరిరక్షించడం, దాని స్ఫూర్తిని కాపాడటం తన ప్రథమ, ప్రాథమిక కర్తవ్యమన్నారు. డాక్టర్ రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం వంటి మహోన్నతులు నిర్వహించిన ఈ పదవి ఔన్నత్యాన్ని కాపాడుతానని తెలిపారు.

చిత్రం.. కోవిందుకు మద్దతుగా తరలివస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,
సీనియర్ నాయకులు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ తదితరులు