జాతీయ వార్తలు

బాధ్యత కేంద్రానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరానికి అన్ని బాధ్యతలూ కేంద్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సైతం కేంద్రమే తెచ్చుకోవాలని అన్నారు. జాతీయ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు శాశ్వతంగానో లేదా కనీసం మూడేళ్లపాటు ఇవ్వాలని కోరారు. ఢిల్లీలోవున్న సిఎం చంద్రబాబు శుక్రవారం కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్దన్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక ఏడాది చొప్పున పర్యావరణ అనుమతి ఇవ్వటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వివరించారు. పోలవరం కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు కనుక, దీనికి పర్యావరణ అనుమతి కనీసం మూడేళ్లపాటో లేదా శాశ్వత ప్రాతిపదికనో ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో సమావేశం అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరిలో పరిశ్రమల స్థాపనకు ద్వారకా తిరుమలలోని 10 వేల ఎకరాల అటవీ భూమి కేటాయించాలని కోరినట్టు వెల్లడించారు. రాజధానికి మరో 12వేల 500 హెక్టార్ల భూమి కేటాయించాల్సి ఉందని, రాష్ట్ర విభజన చట్టంలోవున్న ఈ విషయాన్ని మంత్రి హర్షవర్దన్‌తో చర్చించినట్టు చెప్పారు. ఎర్ర చందనాన్ని విక్రయించటం గురించి కూడా మంత్రితో చర్చించానన్నారు. తాను ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగువిధంగా న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు సిఎం చంద్రబాబు వెల్లడించారు. ఆరోగ్య సమస్యతో విశ్రాంతి తీసుకుంటున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి పరామర్శించానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధలు విడుదల చేసినందుకు రాజ్‌నాథ్ సింగ్‌కు కృతజ్ఞతలు చెప్పానన్నారు.
నిధులు విడుదల చేయాలి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ ప్రభుత్వం వెచ్చించిన మరో 3,007 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉపాభారతిని కోరినట్టు చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలంటే రివైజ్డ్ డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి అందజేయాల్సి ఉంది. దీన్ని మరో పది రోజుల్లో కేంద్రానికి అందిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏర్పాటు చేయాల్సిన పెట్రోలియం రిఫైనరీని వీలైనంత త్వరగా చేపట్టాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరానన్నారు. కెజి బేసిన్ అభివృద్ధిపైనా ప్రధాన్‌తో చర్చించామన్నారు.
ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ విజయం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థి గెలవటం సాధ్యంకాదని తెలిసి కూడా ప్రతిపక్షం పోటీ చేయటం ఏవిధంగా సమర్థనీయమని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్టప్రతి పదవికి రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని అందరూ బలపర్చాలని చంద్రబాబు సూచించారు.