జాతీయ వార్తలు

మైత్రీ బంధానికి మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23:రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం, మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేయడమే అమెరికా పర్యటన చేపట్టడంలో తన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అమెరికా, పోర్చుగల్, నెదర్లాండ్స్‌లలో నాలుగు రోజుల పాటు పర్యటించేందుకు శనివారం ఇక్కడి నుంచి బయలు దేరుతున్న సందర్భంగా మాట్లాడారు. 26న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపే చర్చల్ని భారత అభిప్రాయాల్ని వ్యక్తీకరించేందుకు దక్కిన అవకాశంగానే భావిస్తున్నానని ట్వీట్ చేశారు. భారత్-అమెరికా మధ్య మైత్రీ బంధం ఎంత దృఢంగా ఉంటే అంతగానూ ఇరు దేశాలకు, అలాగే ప్రపంచానికే ఎంతో మంచిదని ఉద్ఘాటించారు. గతంలో ట్రంప్‌తో పలు సందర్భాల్లో ఫోన్‌లో మాట్లాడానని, ఇరు దేశాల ప్రయోజనాల పరిరక్షణకు మరింతగా స్నేహబంధాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన తమలో బలంగా ప్రస్ఫుటించిందని చెప్పారు. భారత్‌తో అమెరికా సంబంధాలు బహుముఖమైనవని, ఎంతో వైవిధ్యంతో కూడుకున్నవని చెప్పిన మోదీ ఇందుకు ప్రభుత్వాల పరంగానే కాకుండా ప్రజల పరంగానూ ఎంతో మద్దతు ఉందని తెలిపారు. తన పర్యటన తొలి దఫాలో భాగంగా శనివారం పోర్చుగల్ వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టాతో విస్తృ చర్చలు జరుపనున్నారు. అలాగే 27న నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టేతో సమావేశమవుతారు. ఆ దేశ రాజదంపతులు అలెగ్జాండర్, మాక్సిమాలను కలుసుకుంటారు.