జాతీయ వార్తలు

సమష్టి కృషితోనే విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 23: నూతన సాంకేతిక ఒరవడికి ఇస్రో శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పిఎస్‌ఎల్‌వి-సి 38 ప్రయోగ విజయనంతరం ఆయన షార్‌లోని మీడియా సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సాంకేతిక విధాన ప్రయోగాల్లో ఇస్రో ఎంతో ఘనత సాధిస్తోందని , ఇదంతా శాస్తవ్రేత్తల సమష్టి కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ప్రపంచ దేశాలు కూడా మన రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయోగం ఒకటే అయినా రెండు ప్రయోగాలతో సమానమని పేర్కొన్నారు. ఎందుకంటే ఒక రాకెట్ ద్వారా గతంలో ఒకే కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపేవారిమని ఈ రాకెట్ ద్వారా వినూత్నంగా పది కక్ష్యల్లోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపామన్నారు. దీని వల్ల ఖర్చు ఆదాతో పాటు మరిన్ని సేవలకు సంబంధించిన ఉపగ్రహాలను తక్కువ కాలంలోనే ప్రయోగించేందుకు వీలుంటుందన్నారు. శాస్తవ్రేత్తల పనితీరు వల్లే రోజురోజుకు విజయాలు పెరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఉన్న దేశాలు కూడా పిఎస్‌ఎల్‌వి వాహక నౌక పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకొంటున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే తరహా ప్రయోగాలే షార్ నుండి నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వివిధ ఒప్పందాల మేరకే ఉపగ్రహాలు తయారు చేసి పంపుతున్నామన్నారు. పిఎస్‌ఎస్‌వి-సి 38 ద్వారా కార్టోశాట్-2ఇ ఉపగ్రహం, యూనివర్సిటి విద్యార్థులు తయారు చేసిన ఎన్ ఐయూ శాట్‌తో పాటు 29విదేశీ ఉపగ్రహాలు రోదసీలోకి విజయవంతంగా పంపామన్నారు. అంతేకాకుందడా ఈ ప్రయోగం 2:15గంటలు సమయం పట్టడం నాలుగో దశలో రెండుసార్లు ఇంజిన్‌ను ఆఫ్‌చేసి మండించి మరలా రీస్టాట్ చేసి మిగిలిన ఏడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామన్నారు. ఈ నెల 28న ఫ్రెంచిగయాన నుంచి జీశాట్-17 ఉపగ్రహ ప్రయోగం ఉంటుందన్నారు. అదే జూలైలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహ ప్రయోగం చేపటనున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు ఈ ఏడాది 5టన్నుల బరువుగల ఉపగ్రహం జీశాట్-11 ప్రయోగం కూడా ఉంటుందన్నారు. ఇకపై బరువైన ఉపగ్రహ ప్రయోగాలు కూడా షార్ నుండే ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు. జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 వంటి భారీ ప్రయోగం ఉంటుందన్నారు. చంద్రయాన్-2, ఆదిత్య ఉపగ్రహ ప్రయోగాల కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది మరో 7ప్రయోగాలు ఉంటాయని స్పష్టం చేశారు. షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ మాట్లాడుతూ 50రోజుల్లో షార్ నుండి మూడు ప్రయోగాలు విజయవంతంగా చేపట్టడం వెనుక శాస్తవ్రేత్తలు కఠోర శ్రమ ఉందన్నారు. ఉపగ్రహ డైరెక్టర్ ఎంఎ.సదానందరావు మాట్లాడుతూ ఉపగ్రహాన్ని తక్కువ కాలంలో రూపకల్పన చేశామన్నారు. కార్యక్రమంలో ఇస్రో శాస్తవ్రేత్తలు డాక్టర్ కె.శివన్, తపన్ మిశ్రా, రాకేష్, వెహికల్ డైరెక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విక్టరీ చిహ్నం చూపుతున్న ఇస్రో చైర్మన్