జాతీయ వార్తలు

‘ఆప్’కు ఇసి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: లాభదాయక పదవుల కేసులో ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తమపై దాఖలైన లాభదాయక పదవుల కేసును ఉపసంహరించుకోవాలంటూ 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇసి తిరస్కరించింది. ఆమ్ ఆద్మీ పార్టీలో కనీసం రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవులు అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. నిబంధనల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి ఏడుగురు మంత్రులే ఉండాలి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. దీన్ని న్యాయస్థానమూ తప్పుపట్టింది. మొత్తం ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌ను రాష్టప్రతి ఆదేశించారు. తమపై దాఖలైన లాభదాయక పదవులు కేసును ఉపసంహరించుకోవాలని ఆప్ ఎమ్మెల్యేలు చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఇసి కేసు విచారణ కొనసాగుతుందని శనివారం ప్రకటించింది. ఆగస్టుకు కేసు వాయిదా వేసింది. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసే నిమిత్తం రాజౌరీ గార్డెన్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన జర్నైల్ సింగ్‌పై విచారణ నిలిపివేశారు. ఇదే కేసును ఢిల్లీ హైకోర్టు పక్కనబెట్టింది. లెఫ్టినెంట్ గవర్నర్ సమ్మతి లేకుండా నియామకాలు జరిగాయని కోర్టు వ్యాఖ్యానించింది. 2015 మార్చి 13న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, జస్టిస్ సంగీత ధింగ్రాతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది.

చిత్రం.. కోర్టు తప్పుపట్టిన 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారి