జాతీయ వార్తలు

డిఎస్పీని కొట్టి చంపిన ఘటనపై సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 24: శ్రీనగర్‌లోని జామా మసీదు వద్ద డిఎస్పీ మహమ్మద్ అయూబ్ పండిత్‌ను రాళ్లతో కొట్టి చంపిన సంఘటనపై దర్యాప్తు జరపడానికి జమ్మూ, కాశ్మీర్ పోలీసు శనివారం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఈ నేరంతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించిన 12 మందిలో అయిదుగురిని అరెస్టు కూడా చేసింది. డిఎస్పీని కొట్టి చంపిన సంఘటనపై వేగంగా దర్యాప్తు జరపడం కోసం ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఓ పోలీసు అధికారి చెప్పారు. కాగా, ఈ సంఘటనతో సంబంధం ఉన్న 12 మందిని గుర్తించడం జరిగిందని, వారిలో అయిదుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్‌పి వైద్ చెప్పారు. వీరిలో ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేయగా, మిగతా ముగ్గుర్ని శనివారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన వారిలో ఇద్దరు సంఘటన జరిగిన సమయంలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ వారని కూడా ఆయన తెలిపారు. ఈ సంఘటన వెనుక ఉన్న వారిని ఎట్టిపరిస్థితుల్లోను వదిలిపెట్టకూడదనేది జమ్మూ, కాశ్మీర్ పోలీసుల కృతనిశ్చయమని కూడా ఆయన చెప్పారు. కాగా, సంఘటన జరిగిన ప్రాంతంలోని ఓ సీనియర్ పోలీసు అధికారిని కూడా ఆయన బదిలీ చేశారు.