జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూన్ 24: ఛత్తీస్‌గడ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో అయిదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. చింతకుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని తొండామార్కా అటవీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ఫోర్సు, ఎస్‌టిఎఫ్, డిస్ట్రిక్టు రిజర్వు గ్రూపు (డిఆర్‌జి), కోబ్రా దళాలు కూంబింగ్ చేబడుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా పోలీసు బలగాలపై కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో స్పెషల్ టాస్క్ఫోర్సుకు చెందిన అయిదుగురు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. గాయపడ్డ జవాన్లను హెలికాఫ్టర్ ద్వారా జగదల్‌పూర్ తరలించినట్టు దంతెవాడ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సుందర్‌రాజ్ తెలిపారు. గాయపడ్డ జవాన్లు ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన ప్రదేశానికి మరిన్ని భద్రతా బలగాలను పంపించి విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

చిత్రం..గాయపడ్డ జవానును హెలికాఫ్టర్‌లో తరలిస్తున్న దృశ్యం