జాతీయ వార్తలు

ఆంటోనీ చేతులు కట్టేసిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, మే 7: అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పంద వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి ఎకె.ఆంటోనీపై బిజెపి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భారత వైమానిక దళానికి వివిఐపి హెలికాప్టర్ల సరఫరా నిమిత్తం అగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థతో 2010లో ఈ వివాదాస్పద ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు ఆంటోనీ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నందున ఈ వ్యవహారంపై ఆయన వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. భారత వైమానిక దళానికి 12 ఎడబ్ల్యు-101 వివిఐపి హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు ఫిన్‌మెకానికా బ్రిటిష్ అనుబంధ సంస్థతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఆంటోనీ కూడా బాధ్యుడేనని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కొచ్చిలో శనివారం ఎర్నాకుళం ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, అప్పట్లో భారత వైమానిక దళానికి ప్రధానాధికారిగా వ్యవహరించిన ఎస్‌పి.త్యాగీ 2007లోనే పదవీ విరమణ పొందారని, అయితే అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు 2010లో ఈ కాంట్రాక్టును ఇవ్వడం జరిగిందని, కనుక ఈ ఒప్పందాన్ని ఎవరి కనుసన్నల్లో కుదుర్చుకున్నారన్న దానిపై ఆంటోనీ వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి ఇటలీలో అగస్టా వెస్ట్‌ల్యాండ్ అధినేత గుసెప్పీ ఓర్సీని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారంపై ఆంటోనీ గత్యంతరం లేక అయిష్టంగానే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారని, అయినప్పటికీ ఆ దర్యాప్తు సక్రమంగా జరగలేదని ఆరోపించారు. అప్పట్లో సిబిఐ ఈ వ్యవహారంలో ఇద్దరు ముఖ్య వ్యక్తులైన ఎంకె.నారాయణన్ (మాజీ జాతీయ భద్రతా సలహాదారు), బివి.వాంచూ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మాజీ చీఫ్) నుంచి వాంగ్మూలాలను స్వీకరించాల్సి ఉందని, అయితే అప్పటికే ఎంకె.నారాయణన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి, వాంచూ గోవా రాష్ట్రానికి గవర్నర్లుగా నియమితులయ్యారన్న సాకుతో వారిని సిబిఐ ప్రశ్నించలేదని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయితే గవర్నర్ పదవుల్లో ఉన్నవారిని ఎవరూ ప్రశ్నించకూడదని రాజ్యాంగ పరంగా ఎటువంటి నిషేధం లేదని ఆయన పేర్కొన్నారు.