జాతీయ వార్తలు

అప్రమత్తతతోనే ప్రజాస్వామ్య రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: నలభై రెండు సంవత్సరాల క్రితం అంటే 1975 జూన్ 25న అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ పీడకలను ఎన్నటికీ మరిచిపోలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం విలువలను నిరంతర నిఘాతో పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరింతగా స్పష్టం చేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం అప్పట్లో ఎందరో నాయకులు ఆ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటమే చేశారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య అనుకూల వారసత్వాన్ని మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆదివారం ప్రసారమైన మన్ కి బాత్‌లో మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి తీరని నష్టం చేసిన అత్యియిక పరిస్థితి నాటి సంఘటనలను గుర్తుచేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా మరింత సంఘటితంగా ముందుకు సాగడం ఎంతో అవసరమన్నారు. ప్రజాస్వామ్యమన్నది ఓ వ్యవస్థ కాదని, ఓ సంస్కృతి అని పేర్కొన్న ఆయన నిరంతర నిఘాతోనే స్వేచ్ఛను పరిరక్షించుకోగలుగుతామని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువల కోసం పాటుపడేవారే కాకుండా ఏ భారతీయుడు కూడా ఆనాటి ఆ చీకటి రోజులను ఎన్నటికీ మరిచిపోలేడని అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో మొత్తం భారతదేశానే్న కారాగారంగా మార్చేశారని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కర్నీ జైలుపాలు చేశారని, స్వేచ్ఛాగళాలను అణచివేశారని మోదీ తెలిపారు. జయప్రకాష్ నారాయణ్, వాజపేయి సహా అనేకమంది జాతీయ నాయకులు జైలుపాలయ్యారని అన్నారు. ఎమర్జెన్సీ ప్రభావం న్యాయవ్యవస్థపై కూడా తీవ్రంగా పడిందని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే మీడియా రాక్షస ఆంక్షలు విధించారని మోదీ గుర్తుచేశారు. పాత్రికేయ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు, అలాగే ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాలనుకునే వ్యక్తులు ఆనాటి ఎమర్జెన్సీ దురంతాలను ఎప్పటికప్పుడు విశే్లషించుకుంటూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులోనే ఉన్న వాజపేయి ఓ కవిత రాశారని గుర్తుచేసిన మోదీ దాన్ని చదివి వినిపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చెలరేగింది. అది ప్రజల మహోద్యమంగా మారడంతో రెండేళ్లలోనే అప్పటి ఇందిర ప్రభుత్వం దాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకునే రీతిలోనే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వచ్చారని పేర్కొన్న మోదీ అదే వారసత్వాన్ని అనుక్షణం శక్తిమంతంగా ముందుకు తీసుకువెళ్లడం ఎంతైనా అవసరమన్నారు.

వైవిధ్యమే భారత్ బలం
*ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
ఈద్ సందర్భంగా దేశవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, భిన్నత్వంలో ఏకత్వంలోనే భారత్ శక్తి ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఈ రకమైన సందర్భాలను వినియోగించుకోవాలన్నారు. ఒకపక్క జగన్నాథ రథయాత్ర జరుగుతున్న సమయంలోనే ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈద్ కూడా రావడం భారతదేశ వైవిధ్యానికి, సమైక్యతకు నిదర్శనమన్నారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
చిత్రం.. మన్ కి బాత్‌లో జాతినుద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ