జాతీయ వార్తలు

దొందూ.. దొందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వ్యవహారం, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియాగాంధీ పాత్రపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘మోదీ నకిలీ డిగ్రీపై కాంగ్రెస్ నోరువిప్పదు. హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియా పాత్ర ఉందని తెలిసినా బిజెపి అరెస్టు చేయనీయదు’ అని ధ్వజమెత్తారు. అగస్టా కేసులో సోనియాగాంధీ, అహ్మద్‌పటేల్ పాత్రను ఇటలీ కోర్టు తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావించిన కేజ్రీవాల్ ‘సోనియాను అరెస్టు చేయించే ధైర్యం మోదీకి లేదు’ అని విరుచుకుపడ్డారు. అలాగే ప్రధాని మోదీ నకిలీ డిగ్రీ విషయంలోనూ మాట్లాడేందుకు కాంగ్రెస్ జంకుతోందని ఢిల్లీ సిఎం స్పష్టం చేశారు.