జాతీయ వార్తలు

గిరిజన సంక్షేమానికి చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. సోమవారం తన నివాసంలో గీత విలేఖరులతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వై.రామవరం మండలం చాపరాయి ప్రాంతాంలో నీటి కాలుష్యంవల్ల 16 మంది గిరిజనుల మృతిచెందడంపై భాదాకరమని అన్నారు. మృతుల కుంటుంబానికి గీతా సొసైటీ తరపున తక్షణ సహాయం కింద 5వేల రూపాయిలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయమన్నారు. ఆ ప్రాంతాలలో నెలకు నలుగురు, ఐదుగురు చనిపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మలేరియా నిర్ములనకోసం ఏర్పాటు చేసిన టీమ్‌లు ఇప్పటివరకు గిరిజన ప్రాంతాలకు వెళ్లలేదని అన్నారు. నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఎంపీ సహాయ నిధినుంచి నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపారు. అధికారులు, నాయకులు సమన్వయంతో గిరిజనుల సంక్షేమంకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన సేవలను అందించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ గిరిజన ప్రాంతాల్లో ఆంత్రాక్స్ మరింతగా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీని నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆంత్రాక్స్ వ్యాధిపట్ల ప్రజల్లో అవగహన కల్పించాలని అన్నారు.