జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 7: జమ్మూకాశ్మీర్‌లో శనివారం తెల్లవారు జామున భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మృతి చెందారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మిలిటెంట్లు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు, ఆర్మీ బలగాలతో కూడిన సంయుక్త బృందం పంజ్‌గామ్ గ్రామాన్ని చుట్టుముట్టింది. సంయుక్త బలగాలు గాలిస్తుండగా ఒక ఇంట్లో తలదాచుకున్న ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో సంయుక్త బలగాలు ఎదురుకాల్పులు జరుపగా ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారని ఒక అధికారి తెలిపారు. ఈ ముగ్గురు స్థానికులని, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని వివరించారు. ఈ ఉగ్రవాదులను దోగిపురకు చెందిన అష్ఫాక్ అహ్మద్ దర్, తహబ్‌కు చెందిన ఇష్ఫాక్ అహ్మద్ బాబా, బ్రావో బంద్యున్‌కు చెందిన హసీబ్ అహ్మద్‌గా గుర్తించారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ తరువాత సంఘటన స్థలంలో ఒక గ్రెనేడ్ పేలి వకీల్ అహ్మద్ షెర్‌గుజ్రి అనే పౌరుడు గాయపడినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు మృతిచెందిన విషయం తెలుసుకున్న ప్రజలు పుల్వామా పట్టణంలో శనివారం ఆందోళనకు దిగారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. దీంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపైకి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు. పుల్వామాలో శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో శ్రీనగర్-బనిహాల్ రైళ్లన్నింటినీ శనివారం రద్దు చేశారు.