జాతీయ వార్తలు

స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎంఎం ఖన్విల్‌కర్, నవీన్ నిన్హాలతో కూడిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ మంగళవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ల ఆందోళన అర్థంలేదని కోర్టు వ్యాఖ్యానించింది.‘ప్రభుత్వ ఆదేశాలతో ఎవరికైనా నష్టం జరిగిందని భావిస్తే అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. దీని కోసం ఓ వారం వేచి ఉండండి. సంక్షేమ పథకాలకు ఆధార్ గుర్తింపువల్ల వచ్చిన నష్టం ఏమిటో ఇదే కోర్టుకు వివరించండి’ అంటూ న్యాయమూర్తులు స్పష్టం చేశారు.‘సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరిచేయడం వల్ల నష్టపోయిన వారెవరూ కోర్టును ఆశ్రయించలేదు. ఎవరు ఇబ్బంది పడుతున్నారో అన్నది కూడా వివరించలేదు. ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేం’ అంటూ పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆధార్ గుర్తింపు లేదన్న కారణంతో సంక్షేమ పథకాల ప్రయోజనం అందకుండా నిరాకరించొద్దని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ తన వాదనలు వినిపించారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ఆధార్ లేకుండా సంక్షేమ పథకాల లబ్ధిపొందేందుకు జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30 వరకూ గడువుపొడిగిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ఆధార్ లేదన్న కారణంతో సంక్షేమ పథకాల ఫలాలు అందించకుండా ఆపిన సందర్భాలు లేవని ఆయన పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణ జూలై 7కు వాయిదా పడింది. ప్రజా పంపిణీ విధానం ద్వారా లబ్ధిపొందే వారు ఆధార్ గుర్తింపుకార్డుగా చూపాలని ఫిబ్రవరి 8న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తుషార్ తెలిపారు. ఒకవేళ ఆధార్ లేని అతడు/ఆమె మరొక గుర్తింపుకార్డుతో లబ్ధిపొందే వెసులుబాటు ఉందని ఆయన కోర్టుకు చెప్పారు. ఓటర్ గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్ కార్డులను చూపించవచ్చని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు.