జాతీయ వార్తలు

జిఎస్‌టి సమస్యల పరిష్కారానికి ‘వార్‌రూమ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: జూలై 1నుంచి వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలులోకి రానుండడంతో దీని అమలులో ఎదురయ్యే ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఒక మినీ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వార్‌రూమ్‌లో పలు ఫోన్ లైన్లు, కంప్యూటర్లతో పాటుగా వాటిని నిహించేందుకు టెక్నాలజీ బాగా తెలిసిన పలువురు యువ నిపుణులు కూడా ఉంటారు. జూలై 1నుంచి అమలయ్యే ఈ చరిత్రాత్మక పన్ను సంస్కరణ అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారానికి అడిగే ప్రశ్నలకు ఈ విభాగం క్విక్ రిసోర్స్ సెంటర్‌గా పని చేస్తుందని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల బోర్డు(సిబిఇసి) చీఫ్ వనజా ఎన్ సర్నా చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకోసం ఒక జిఎస్‌టి ఫీడ్‌బ్యాక్ యాక్షన్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని, ఏ ప్రాంతంలోనైనా జిఎస్‌టి అమలుకు సంబంధించి తలెత్తే సమస్యలకు సంబంధించి అడిగే ప్రశ్నలకు ఇది తక్షణమే స్పందిస్తుందని ఆమె తెలిపారు. కంప్యూటర్లు, పలు ఫోన్‌లైన్లు కలిగి ఉండే ఈ వార్‌రూమ్ జిఎస్‌టికి సంబంధించి ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి ఏక గవాక్షం(సింగిల్ విండో)గా ఉంటుందని సిబిఇసి వర్గాలు తెలిపారు.