జాతీయ వార్తలు

నేటి అర్ధరాత్రే జీశాట్-17 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి జీశాట్-17 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. 3,447కిలోల బరువుగల జీశాట్-17 ఉపగ్రహాన్ని ముందస్తు ఒప్పందం ప్రకారం ఫ్రెంచి గయానా నుంచి ఏరియల్-5 రాకెట్ నుండి ప్రయోగిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక గురువారం తెల్లవారు జామున 2గంటల 29నిమిషాలకు ఫ్రెంచిగయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి జీశాట్-17 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది విజయవంతమైతే 15సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఇందులో 42 ట్రాన్స్‌ఫాండర్లను శాస్తవ్రేత్తలు పొందుపరిచారు. ఇందులో సి బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు 24 కాగా లోయర్ సి బ్యాండ్ 2, అప్పర్ సి బ్యాండ్ 12, సీఎక్స్‌ఎస్ బ్యాండ్ 2, ఎస్‌ఎక్స్‌సి బ్యాండ్ 2 ఉన్నాయి. భవిష్యత్‌లో ట్రాన్స్‌ఫాండర్ల కొరతను దృష్టిలో పెట్టుకొని ఇస్రో సమాచార రంగానికి చెందిన ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఇది విజయవంతమైతే మనకు వాటి కొరత తీరునుంది. ఇది కక్ష్యలోకి చేరిన వెంటనే దాని సేవలు మనకు అందనున్నాయి. ఇటీవలే జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-19 భారీ ఉపగ్రహాన్ని షార్ కేంద్రం నుండి ఇస్రో తొలిసారిగా ప్రయోగించి విజయం సాధించింది.