జాతీయ వార్తలు

వరదల సమయంలో ఏమైపోయారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదురై, మే 7: గత ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల సమయంలో ప్రజల కష్టాలు విని వారిని ఓదార్చడానికి బదులు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాలుగు గోడల మధ్యే ఉండిపోయారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ నెల 16న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకోసం తొలిసారిగా శనివారం మదురైలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డిఎంకె కోశాధికారి, పార్టీ అధ్యక్షుడు ఎం కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్‌తో కలిసి పాల్గొన్న రాహుల్ గత ఏడాది చివర్లో చెన్నైసహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించిన వరదలపైనే ప్రధానంగా జయలలితపై విమర్శలు సంధించారు.
అన్నాడిఎంకె పాలనలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు. గతంలో పరిశ్రమలు తమిళనాడుకు క్యూ కట్టేవని, అయితే ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదని అన్నారు. పెరియార్ ఇవి రామస్వామి, కామరాజ్, ఎంజిఆర్, కరుణానిధి లాంటి నేతలంతా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లు చెప్పేది విని, వారినుంచి ఎంతో నేర్చుకున్నారని, స్టాలిన్‌కు సైతం అలాంటి నాయకత్వ లక్షణాలున్నాయని రాహుల్ చెప్పారు.
నల్లజెండాల ప్రదర్శన
శనివారం కోయంబత్తూరులో జరగబోయే ఓ సభలో ప్రసంగించడానికి రాహుల్ గాంధీ రావడానికి కొన్ని గంటల ముందు శ్రీలంక తమిళుల సమస్యపై రాహుల్ వైఖరికి నిరసనగా నల్లజెండాలతో ప్రదర్శన జరపడానికి యత్నించిన తంతై పెరియార్ ద్రావిడర్ కళగమ్ (టిపిడికె)కు చెందిన 91 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలంకలో ఎల్‌టిటిఇని అంతం చేయడమనే ముసుగులో వేలాది మంది తమిళులను హతమార్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వౌనంగా చూస్తూ ఉండిపోయిందంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా టిడిపికె కార్యదర్శి కె రామకృష్ణన్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

చిత్రం కోయంబత్తూరులో శనివారం కాంగ్రెస్, డిఎంకె పార్టీలు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌కు ఖడ్గాన్ని బహూకరిస్తున్న డిఎంకె కార్యకర్త.