జాతీయ వార్తలు

ఆ 9 మంది భవితవ్యంపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్, మే 7: ఉత్తరాఖండ్‌లో సస్పెండ్ అయిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠత పెరుగుతోంది. తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన తీర్పు బలపరీక్షకు ముందు రోజు వెలువడనుంది. ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బలపరీక్ష ఈ నెల 10 ఉన్నందున దానికి ముందురోజే అంటే 9న తొమ్మిది మంది ఎమ్మెల్యేల భవిష్యత్ తేలిపోనుంది. మూడు గంటలసేపు ఇరుపక్షాల వాదనలు విన్న ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సోమవారం వెలువరించనుంది. అనర్హతవేటుకు గురైన తొమ్మిది మంది సభ్యులు 10న జరిగే బలపరీక్షకు హాజరుకావద్దంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బిజెపికి 28 మంది, కాంగ్రెస్‌కు 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
బిఎస్‌పికి ఇద్దరు, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్(పి)కి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అలాగే తొమ్మిది మంది కాంగ్రెస్ రెబల్స్, ఒక బిజెపి రెబల్ ఉన్నారు. సస్పెండైన తొమ్మిది మంది ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది సి.అరియామా సుందరం హైకోర్టులో వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయం పక్షపాతమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వాదించారు. 9 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు అందజేసిన జాయింట్ మెమోను తప్పుపట్టలేమని అన్నారు. కాగా స్పీకర్ చర్యను సీనియర్ న్యాయవాది అమిత్ సిబల్ సమర్థించారు. మరోవైపు 10వ తేదీన హరీశ్ రావత్ విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ సభ్యులకు విప్‌లను జారీచేశాయ.