జాతీయ వార్తలు

పదిహేనేళ్లకే తల్లులవుతున్న అభాగ్యులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 7: భారతదేశంలో ఇప్పటికీ అత్యధికంగా బాల వివాహితలున్నారని, గత 15ఏళ్లలో బాల్య వివాహాల సంఖ్య కేవలం 11 శాతమే తగ్గాయని ‘చైల్డ్ రైట్స్ అండ్ యు’ (సిఆర్‌వై) అనే ఓ స్వచ్ఛంద సంస్థ తెలియజేసింది. ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ఆ సంస్థ ఈ కఠోర వాస్తవాలను వెల్లడించడం గమనార్హం. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని గుర్తించడం ఓ మంచి పరిణామమేనని ఆ సంస్థ అంటూ, అయితే తల్లిదండ్రుల బలవంతం, ఆడపిల్లల అక్రమ రవాణా, ఆర్థిక, సామాజిక భద్రత కరవైన కారణంగా యుక్త వయసు రాకుండానే ఆడపిల్లలు మాతృత్వం పొందుతుండడంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాల వధువులున్నారు. వీరిలో 50 శాతానికి పైగా రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఉన్నారని సిఆర్‌వై ఒక ప్రకటనలో తెలిపింది. 2013లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బాల్య వివాహాల నిరోధంపై రూపొందించిన వ్యూహ పత్రం ప్రకారం గత 15 ఏళ్ల కాలంలో దేశంలో బాల్య వివాహాల సంఖ్య కేవలం 11 శాతం తగ్గిందని, అంటే ఏడాదికి ఒక శాతంకన్నా తక్కువేనని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహారాష్టల్రో 15 ఏళ్లకన్నా తక్కువ వయసులో పెళ్లయిన అమ్మాయిలు 2,12,993 మంది ఉండగా, వీరిలో 21 శాతం మంది తల్లులని తెలిపింది. ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న సామాజిక కట్టుబాట్లు, మత ఆచారాలు, విశ్వాసాలు ఈ సామాజిక రుగ్మతకు ప్రధాన కారణాలని పేర్కొన్న ఆ సంస్థ చట్టాలు సైతం అలాంటి వారికి రక్షణగా నిలవడం లేదని, 15 ఏళ్ల లోపు వయసున్న భార్యపై భర్త జరిపే లైంగిక చర్య అత్యాచారం కిందికి రాదని భారత శిక్షాస్మృతిలో నిబంధనలే చెబుతున్నాయని, దీన్నిబట్టి మన చట్టాలు ఈ విషయంలో ఎంత సీరియస్‌గా ఉన్నాయో అర్థమవుతుందని పేర్కొంది.