జాతీయ వార్తలు

కరవు కాటేసింది.. ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కరువు నెలకొన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. మొదటి విడత కింద ఆయన శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కర్నాటక సిఎం సిద్ధరామయ్యలతో వారి రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రజలు ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వం అందజేసిన సహాయం, సహాయ, పునరావాస చర్యల గురించి చర్చించారు. తాగునీటి సరఫరా గురించి సమీక్షించటంతోపాటు పశుగ్రాసం లభ్యతపై కూడా వారు దృష్టి సారించారు. కరువు తీవ్రంగా ఉన్నందుకే మోదీ మొదట ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక ముఖ్యమంత్రులతో విడివిడిగా చర్చలు జరిపారనీ, ఇకమీదట కరువు నెలకొన్న ఇతర రాష్ట్రాల సిఎంలతో కూడా చర్చలు జరుపుతారని పిఎంఓ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో కూడా చర్చలు జరిపే అవకాశాలున్నాయని వారంటున్నారు.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రంతోపాటు స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి పని చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. కరువు రాకుండా చూసేందుకు స్వల్ప కాలిక, దీర్ఘకాలిక పథకాలపై దృష్టి సారించారని మోదీ సూచించారు. జలాలను పకడ్బందీగా ఉపయోగించుకోవాలని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలన్నారు. నీటి పొదుపు చర్యలను పెద్ద ఎత్తున చేపట్టటంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. నీటి నిర్వహణకు ఛత్రపతి శివాజీ అనుసరించిన విధానాన్ని అవలంబించాలన్నారు. కరువు నెలకొన్న ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తీసుకున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు అమలు జరుగుతున్న తీరును సమీక్షించారు. ఉపాధి లభించకపోవటంతో గ్రామాల్లో జనం ఇతర ప్రాంతాలకు తరలిపోవటంపై కూడా సమావేశంలో చర్చించినట్లు అధికారులు చెబుతున్నారు. తాగునీటి సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారని అంటున్నారు. పశుగ్రాసం సరఫరాకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తాగునీటి కొరతను తీర్చేందుకు అవసరమైతే జల రైళ్లను పంపించాలని భావిస్తున్నారు.
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘ కాలిక చర్యలపై దృష్టి కేంద్రీకరించామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమావేశానంతరం విలేఖరులతో చెప్పారు. కరువు కోరల్లో చిక్కుకున్న మరో పదకొండు వేల గ్రామాలకు ఆర్థిక సహాయం చేయాలన్న తన ప్రతిపాదనను ప్రధాని ఆమోదించారని తెలిపారు. ప్రజలు ఉపాధి లభించక ఇతర ప్రాంతాలకు వలస పోకుండా చూసేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఫడ్నవీస్ చెప్పారు.
కరువుతోపాటు వడగండ్ల వాన మూలంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ప్రధానిని కోరినట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమావేశానంతరం తెలిపారు. కరువును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించటంతోపాటు కేంద్రం చేయవలసిన సహాయం గురించి కూడా ప్రధానితో చర్చించినట్లు యాదవ్ చెప్పారు. కరవు సహాయక చర్యల కోసం వివిధ పద్దుల కింద 11 వేల కోట్ల సాయం చేయాలని ప్రధానిని కోరినట్లు ఆయన చెప్పారు. తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న బుందేల్‌ఖండ్‌లో తాగునీరు లభిస్తోందంటూ, లభిస్తున్న తాగునీటిని అవసరమున్న ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.ప్రధాని సమీక్షా సమావేశానికి వ్యవసాయ, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు, పిఎంఓ సీనియర్ అధికారులు హాజరయ్యారు.

చిత్రం ఢిల్లీలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య