జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో 7,500 దరఖాస్తులు పరిష్కరించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 7: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 7,500 దరఖాస్తులు పరిష్కరించామని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ తెలిపారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం రెండు రాష్ట్రాల సమాచార హక్కు ఉద్యమకార్యకర్తల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 750 కేసుల్లో జరిమానా విధించామని, 1000 కేసుల్లో నష్టపరిహారం ఇప్పించామన్నారు. మరో రెండు వేల కేసులు తిరస్కరించినట్లు వివరించారు. ప్రజలు చైతన్యవంతులైతే సమాచారహక్కు చట్టం వజ్రాయుధంగా మారుతుందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసమే ఈ చట్టాన్ని ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ ఫైళ్లలో ఉన్న సమాచారం మాత్రమే తీసుకోవాలని, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఈ సమాచారాన్ని ఉపయోగించాలన్నారు. తక్కువ ప్రశ్నలతో ఎక్కువ సమాచారం పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ఉద్యమకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో జడ్పీ సిఇఓ జయప్రకాష్ నారాయణ, పబ్లిక్ ఫోరం ఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కో-ఆర్డినేటర్ కెవి రమణ, గీతం వర్సిటీ స్కూల్ ఆఫ్ లా డైరెక్టర్ వై.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.