జాతీయ వార్తలు

ఉప రాష్టప్రతి వెంకయ్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఉప రాష్టప్రతి పదవికి ఆగస్టు 5న జరిగే ఎన్నికల్లో ఎన్డీయే తరఫున వెంకయ్యనాయుడిని రంగంలోకి దించుతున్నట్టు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ప్రకటించారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే కేంద్ర మంత్రి పదవికి వెంకయ్య రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసేందుకు ఉద్యుక్తుడైనా, అధినాయకత్వం ఆదేశాల మేరకు మంగళవారం చేయనున్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే, 11 గంటలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వెంకయ్యను ఉప రాష్టప్రతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఎంపిక చేశారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా వ్యవహరించే ఉప రాష్టప్రతి ఎన్నికలో బిజెపి, దాని మిత్రపక్షాలకు భారీ మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ లెక్కన వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతి పదవికి ఎన్నిక కావటం లాంచనమే. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం వెంకయ్యనాయుడిని తన చాంబర్‌కు పిలిపించుకుని ఉప రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్టు చెప్పి అభినందనలు తెలిపారు. బిజెపి మూల సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని మోదీ ఆయనకు హితవు పలికారు. రాజ్యసభలో ప్రతిపక్షాన్ని అదుపుచేయగల సామర్థ్యం, బిజెపి, ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలతో చిరకాల అనుబంధంతోపాటు నరేంద్ర మోదీకి సన్నిహితంగా ఉన్నందుకే వెంకయ్యను ఉప రాష్టప్రతి పదవికి ఎంపిక చేశారు. 1997 నుంచి దక్షిణాదికి చెందిన నేతలు ఉప రాష్టప్రతి పదవిని చేపట్టలేదు. కాబట్టి ఈసారి తప్పకుండా దక్షిణాది నేతను ఉప రాష్టప్రతిగా చేయాలని బిజెపితోపాటు ఆరెస్సెస్ అధినాయకత్వం నిర్ణయించాయి. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పేరు కూడా పరిశీలనకు వచ్చినా, చివరికి వెంకయ్యవైపు మొగ్గు చూపారు. బిజెపి కోర్ కమిటీ సమావేశంలో వెంకయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అనంతరం పార్టీ అధినాయకత్వం ఎన్డీయే మిత్రపక్ష నేతల ఆమోదం తీసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ ఎన్డీయే మిత్రపక్షాలకు ఫోన్ చేసి వెంకయ్య అభ్యర్థిత్వం గురించి చెప్పటంతోపాటు, వారికిగల అభ్యంతరాలు తెలుసుకున్నారు. ఎన్డీయే మిత్రపక్ష నేతలంతా వెంకయ్య అభ్యర్థిత్వంపట్ల సమ్మతి తెలియజేస్తూ మద్దతు ప్రకటించినట్టు తెలిసింది. వెంకయ్య మంత్రిగా ఉన్నప్పుడే రాజ్యసభలో ప్రతిపక్షాలకు అడ్డుతగిలేవారు. ఆయన రాజ్యసభ చైర్మన్ పదవి చేపట్టిన తరువాత ప్రతిపక్షాలకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
ఉప రాష్టప్రతి పదవికి బిజెపి మిత్రపక్షాల అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్య మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ప్రతిపక్షం అభ్యర్థి గోపాలకృష్ణగాంధీ కూడా మంగళవారమే నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉప రాష్టప్రతి పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారం చివరి తేదీ.
వెంకయ్య అత్యంత సమర్ధుడైన సీనియర్ నేత. అందుకే అతన్ని ఉప రాష్టప్రతి పదవికి ఎంపిక చేశామని అమిత్ షా మీడియా సమావేశంలో ప్రకటించారు. బిజెపి సీనియర్ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం మిత్రపక్షాల నేతలతో మాట్లాడిన తరువాతే వెంకయ్య ఆభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు వివరించారు. వెంకయ్యకు పార్లమెంటులో దాదాపు ఇరవై ఐదేళ్ల అనుభవం ఉందని గుర్తు చేస్తూ ప్రశంసించారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న వెంకయ్య అభ్యర్థిత్వాన్ని మిత్రపక్షాల నేతలంతా బలపరిచినట్టు అమిత్ షా చెప్పారు. ఉప రాష్టప్రతి పదవికి మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నా, పార్లమెంటరీ బోర్డు చివరకు వెంకయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని షా వివరించారు.

చిత్రం.. వెంకయ్యనాయుడిని అభినందిస్తున్న ప్రధాని మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా