జాతీయ వార్తలు

త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17:మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప రాష్టప్రతిగా బరిలోకి దిగుతున్న కేంద్ర సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు తాను నిర్వహిస్తున్న శాఖలకు రాజీనామా చేయడంతో కేబినెట్ విస్తరణ అనివార్యమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వెంకయ్య నాయుడి రాజీనామాతోనే సమాచార, ప్రసార, పట్టణాభివృద్ధి శాఖలు ఖాళీ అవుతాయి. ఇప్పటికే రక్షణ, పర్యావరణ శాఖలు పూర్తి స్థాయి మంత్రి లేకుండానే పనిచేస్తున్నాయి. ఈ రెండు శాఖలను అదనపు బాధ్యతగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి హర్ష్ వర్దన్‌లు నిర్వహిస్తున్నారను. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాతే ప్రధాని మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేపట్టవచ్చునని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మోదీ మంత్రివర్గంలో ఈసారి కొందరు కొత్త వారికి అవకాశం లభించవచ్చునని తెలుస్తోంది. గోవా ముఖ్యమంత్రి బాధ్యతలను మనోహర్ పారికర్ చేపట్టడంతో రక్షణ శాఖ, అనిల్ దావే మరణంతో పర్యావరణ మంత్రిత్వ శాఖలకు పూర్తిస్థాయి మంత్రులు లేకుండా పనిచేస్తున్న విషయం తెలిసిందే.