జాతీయ వార్తలు

మరిన్ని అవకాశాలు ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17:రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు ప్రజలకు పదేపదే అవకాశాలు ఇవ్వలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు నివేదించింది. ఇలా అవకాశాలను పెంచుతూ పోవడం వల్ల పెద్దనోట్ల రద్దు వెనుక ఉన్న నల్లధన నిర్మూలన లక్ష్యం నీరుగారిపోతుందని ఓ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. నిజమైన కారణాల వల్ల 500, 1000 నోట్లను బ్యాంకు ల్లో డిపాజిట్ చేయలేని వారికి అవకాశం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు వివరణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీ వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చామని తెలిపింది.