జాతీయ వార్తలు

ప్రతీకారం మా హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము/ న్యూఢిల్లీ, జూలై 17: ప్రతీకారం తీర్చుకునే హక్కు తాము ఎప్పటికీ కలిగి ఉంటామని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తే చేతులు ముడుచుకు కూర్చునేది లేదని పాకిస్తాన్‌కు భారత్ తెగేసి చెప్పింది. జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో వాస్తవాధీనరేఖ వెంబడి రెండు మాసాలుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంపై భారత్ తీవ్రంగా స్పందించింది. సోమవారం పూంఛ్ సెక్టార్‌లో మరోసారి పాక్ కాల్పులకు తెగబడిన ఘటనలో జవాను, తొమ్మిదేళ్ల బాలిక మరణించటంతో మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ (డిజిఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ ఎకె భట్, పాక్ డిజిఎంఓకు ఫోన్ చేసి తీవ్ర నిరసనను భారత్ తరపున వ్యక్తం చేశారు. భారత్‌కు ప్రతీకార చర్యలకు పాల్పడే హక్కు, అధికారం ఉన్నాయని స్పష్టం చేశారు. ‘శాంతి పరిరక్షంకు నిబద్ధతతో కృషి చేస్తున్నాం. అయితే అదే సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దానిపై ప్రతీకారం తీర్చుకోడానికి వెనుకాడేది లేదు’ అని భట్ పాకిస్తాన్‌కు తెలియజేసినట్టు ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమన్ ఆనంద్ పేర్కొన్నారు. పూంఛ్, రాజోరీ జిల్లాల్లో సరిహద్దు వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో జవాను, బాలిక చనిపోవటాన్ని భట్ ప్రస్తావించారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అథ్‌ముఖమ్ సెక్టర్‌లో గతవారం ఒక పౌరుడు, నలుగురు పాకిస్తాన్ జవానులు చనిపోయిన అంశాన్ని పాకిస్తానీ కమాండర్ జనరల్ సాహిర్ శంషాద్ మీర్జా భట్ దగ్గర ప్రస్తావించారు. ‘్భరత డిజిఎంఓ సుమారు పది నిమిషాలపాటు హాట్‌లైన్‌లో పాకిస్తాన్ డిజిఎంఓతో మాట్లాడారు. పాకిస్తాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటాన్ని భట్ ఇందులో ప్రస్తావించారు. పాకిస్తాన్ వైపునుంచి చొరబాట్లను నిరోధించటానికే భారత సైన్యం కాల్పులు జరిపిందని కూడా స్పష్టం చేశారు’ అని ఆనంద్ వివరించారు.
పూంఛ్‌లో తెగబడిన పాక్
పూంఛ్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. భారీఎత్తున మోర్టార్లు పేల్చడంతో ఒక జవానుతోపాటు తొమ్మిదేళ్ల బాలిక చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎవరూ రెచ్చగొట్టకుండానే సోమవారం ఉదయం 7.30కు పెద్దఎత్తున కాల్పులకు పాల్పడిందని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాల్పుల్లో 37 ఏళ్ల అహ్మద్ అనే జవాను మరణించారు. తొమ్మిదేళ్ల సాజాదా అనే అమ్మాయి కూడా మృత్యువాత పడింది. రాజోరీలో పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు.

చిత్రం.. పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన భారత జవాను ముద్దసర్ అహ్మద్