జాతీయ వార్తలు

అప్రతిహతం వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ముప్పవరపు వెంకయ్యనాయుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జూలై 1న ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా నెల్లూరులోనే జరిగింది. వి.ఆర్ కళాశాల నుంచి డిగ్రీలో బిఏ పూర్తి చేసిన వెంకయ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విద్యార్థి దశలోనే న్యాయకత్వ లక్షణాలను అలవరుచుకున్న వెంకయ్యనాయుడు, 1972 జైఆంధ్రా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అనేక నెలలపాటు జైలు జీవితం గడిపారు. 1973-74లో ఆంధ్ర వర్సిటీ విద్యార్థి నాయకుడిగా వ్యవహరించారు. 1977-80 మధ్య కాలంలో జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 ఏపి శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గంనుంచి జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకయ్య గెలిచారు. 1983లో జనతా పార్టీ నుంచి అదే నియోజక వర్గం నుంచి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980-83 మధ్యకాలంలో బిజెపి యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1980-83 బిజెపి శాసనసభపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించారు. 1985లో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన 1988నుంచి 1993వరకు ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991లో ఒంగోలు పార్లమెంట్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1996లో హైదరాబాద్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసిన వెంకయ్య ఓటమి పాలయ్యారు. 1993నుంచి 2000వరకు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అలాగే 1998-2016 కర్నాటక నుంచి వరుసగా మూడుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2000లో మాజీ ప్రధాని వాజపేయి నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. జానా కృష్ణమూర్తి తరువాత 2002 జూలై 1నుంచి 2004 అక్టోబర్ 5 వరకు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004 ఆయన నాయకత్వంలో బిజెపి ఓడిపోవడంలో అనంతరం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 1998నుంచి 2000వరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా వ్యవహరిచడంతో పాటు బిజెపి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సెక్రటరీగా పని చేశారు. అదే సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. 2014నుంచి నరేంద్ర మోదీ మంత్రిమండలిలో పట్టణాభివృద్ధి, గృహానిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార ప్రసార శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. 2016 మేలో రాజ్యసభకు రాజస్థాన్ నుంచి నామినేట్ అయ్యారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన సమయంలో ఆయన వివిధ పార్లమెంటరీ కమిటీలకు సభ్యుడుగా పనిచేశారు.
కుటుంబ నేపథ్యం
1971 ఏప్రిల్ 14నాడు ఉషను వివాహం చేసుకున్న వెంకయ్యనాయుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు హర్షవర్ధన్ వ్యాపార రంగంలో స్థిరపడగా, కుమార్తె దీపావెంకట్ స్వర్ణ్భారతి ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్థానం

చిత్రాలు..
విద్యార్థి నాయకుడిగా, నాదెళ్ల వెన్నుపోటు సమయంలో తెలుగుదేశం పార్టీ అప్పటి అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు అండగా, ఎమర్జెన్సీలో జైలు గోడల మధ్య, జై ఆంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న నేతగా వివిధ సందర్భాలలో వెంకయ్యనాయుడి చిత్రమాలిక