జాతీయ వార్తలు

సియాచిన్‌లో హిమపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 25: జమ్మూకాశ్మీర్‌లోని సియాచిన్ సెక్టార్‌లో భారీగా కురుస్తున్న హిమపాతం వల్ల శుక్రవారం పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఒక జవాను మృతి చెందాడు. మరో జవాను గల్లంతయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ్భూమి టుర్‌టుక్ ప్రాంతానికి పెట్రోలింగ్ పార్టీ చేరుకోగానే ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో తీవ్ర స్థాయి లో మంచు కురిసింది. దీంతో పెట్రోలింగ్ పార్టీలోని ఇద్దరు జవాన్లు మంచుకింద కూరుకుపోయారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టగా ఒక జవాను మరణించి మంచునుంచి బయటపడ్డాడని, మరో జవాను ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని ఆయన వివరించారు. గల్లంతయిన జవాను ఆచూకీని కనుగొని బయటకు తీయడానికి అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.