జాతీయ వార్తలు

కాళేశ్వరాన్ని ఆపమని ఇప్పటికిప్పుడు ఆదేశించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణ పనులు ఆపేలా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలేమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) స్పష్టం చేసింది. గురువారం నాడు కాలేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఏన్జీటిలో దాఖలైన పిటిషన్‌ను ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనల వినిపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి పర్వావరణ అనుమతులు లేకుండానే ప్రభుత్వం నిర్మిస్తోందని వివరించారు. ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ఏన్జీటికి విజ్ఞప్తి చేశారు. ట్రిబ్యునల్ జోక్యం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణ పనులను జనవరిలో ప్రారంభిస్తే ఇప్పుడు ఆపమనడం ఏంటిని ప్రశ్నించారు. పనులు నిలుపుదల చేసేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చే సమాధారాన్నిబట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి విచారణ జరుపుతామని ఏన్జీటి పేర్కొంది. పిటిషనర్లు లేవనేత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు.