జాతీయ వార్తలు

ఇది ప్రజాస్వామ్యానికి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: ఉత్తరాఖండ్‌లో బలపరీక్ష ప్రజాస్వామ్యానికి విజయమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభివర్ణించారు. మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష ముగిసిన తర్వాత సోనియా మీడియాతో మాట్లాడారు. బుధవారం సుప్రీంకోర్టు అధికారికంగా ఫలితాలను ప్రకటించిన తర్వాత పార్టీ వైఖరి తెలియజేస్తామని పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని బట్టి మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ విజయం సాధించారని పార్టీ అంచనా వేస్తోందని ఆయన అన్నారు. బలపరీక్షలో విజయం సాధించిన తర్వాత రావత్ అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలకు వెళ్తారా అన్న ప్రశ్నకు సింఘ్వి సమాధానాన్ని దాటవేశారు. కాగా, మెజారిటీని ‘కొనుగోలు’ చేయడానికి రావత్ ప్రయత్నించారని మరోవైపు బిజెపి ఆరోపిస్తూ, ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్తారని పేర్కొంది. రావత్ ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వడానికి ప్రయత్నించారని స్టింగ్ ఆపరేషన్లలో స్పష్టంగా బైటపడిందని పేర్కొన్న ఆ పార్టీ, బలపరీక్ష సమయంలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బిజెపి శిబిరంలోకి మారడాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభమే రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు కారణమని బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ బలపరీక్ష తర్వాత విలేఖరులతో అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రావత్ రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ములను ఉపయోగించారని, అయితే రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ఆయన గెలుచుకోలేరని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయన గుణపాఠం చెప్పి తీరుతారని అన్నారు.