జాతీయ వార్తలు

రోహిత్ వేముల సోదరునికి ఉద్యోగంపై ఆప్ సర్కారుపై పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల సోదరునికి పరిహార కారణాలతో ఉద్యోగం ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రోహిత్ వేముల సోదరుడు వేముల రాజ చైతన్య కుమార్‌కు గ్రూప్-సి ఉద్యోగాన్ని ఇవ్వడంతోపాటు వసతి కల్పించాలని ఫిబ్రవరి 24వ తేదీన ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇందుకు సంబంధించి మార్చి 3వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమైనదే కాకుండా రాజకీయ దురుద్ధేశంతో కూడినదని పేర్కొంటూ అవధ్ కౌశిక్ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఉపాధి కల్పించడం ద్వారా తనకు, తన కుటుంబానికి సాయాన్ని అందించాలని రోహిత్ సోదరుడు చేసుకున్న విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఢిల్లీ మంత్రివర్గం పేర్కొంది. అయితే రోహిత్ వేముల కుటుంబ సభ్యుల నుంచి ఇటువంటి విజ్ఞప్తి ఏదీ అందకపోయినప్పటికీ ఢిల్లీ మంత్రివర్గం అక్రమంగా ఈ నిర్ణయం తీసుకుందని, దీని వెనుక రాజకీయ దురుద్ధేశం ఉందని అవధ్ కౌశిక్ ఆరోపించారు. రోహిత్ వేముల ఢిల్లీకి చెందినవాడు గానీ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగిగానీ కాదని, కనుక పరిహార కారణాలతో ఢిల్లీ ప్రభుత్వం అతని కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ నెల 17వ తేదీన విచారణ జరుపనుంది.