జాతీయ వార్తలు

గెలిస్తే.. నేనే ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 10: తమిళనాడు శాసనసభకు ఈ నెల 16వ తేదీన జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తానేనని ఆ పార్టీ అధినేత ఎం.కరుణానిధి (93) మంగళవారం వెల్లడించారు. తాను మరణించే వరకు తన కుమారుడు ఎంకె.స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికోసం ఎదురు చూడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని స్టాలిన్ కూడా కోరుకోవడం లేదు. డిఎంకె అధ్యక్షుడు (కరుణానిధి) ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. 1957 నుంచి నేను ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. కనుక ప్రస్తుతం జరిగే శాసనసభ ఎన్నికల్లో నేను విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా ఆరోసారి బాధ్యతలు చేపడతా’ అని ఎన్‌డిటీవీతో కరుణానిధి అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె విజయం సాధిస్తే పార్టీలోని యువతకు మార్గాన్ని సుగమం చేస్తారా? అన్న ప్రశ్నకు కరుణానిధి సమాధానిమిస్తూ, ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ తమ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే ప్రభుత్వానికి స్వయంగా తానే సారథ్యం వహిస్తానని చెప్పారు. తాను మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్న ప్రథముల్లో తన కుమారుడు, డిఎంకె కోశాధికారి స్టాలిన్ కూడా ఒకరని కరుణానిధి తెలిపారు.