జాతీయ వార్తలు

‘్ఫర్చ్యూన్’ ప్రపంచ టాప్-50 నేతల జాబితాలో కేజ్రివాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకుల జాబితాలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు స్థానం లభించింది. అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో భారత్‌నుంచి స్థానం పొందిన ఏకైక వ్యక్తి కేజ్రివాల్ కావడం గమనార్హం. తమ చర్యల ద్వారా ప్రపంచాన్ని మార్చి వేయడమే కాక ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యాపారం, ప్రభుత్వం, దాతృత్వం, కళలు తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. 47 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతకు ఈ జాబితాలో 47వ స్థానం లభించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి నగర రోడ్లపై ప్రత్యామ్నాయ రోజుల్లో సరి-బేసి నంబర్ల వాహనాలను మాత్రమే అనుమతించే వినూత్న పథకాన్ని అమలు చేసి విజయవంతమైన వ్యక్తిగా కేజ్రివాల్‌ను ఆ మ్యాగజైన్ అనివర్ణించింది. కేజ్రివాల్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇది విజయవంతమవుతుందని ఎవరూ అనుకోలేదని, అయితే ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి, ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని ఆ మ్యాగజైన్ అభివర్ణించింది. జాబితాలో పోప్ ఫ్రాన్సిస్ నాలుగో స్థానంలో నిలవగా, యాపిల్ సిఈఓ టిమ్ కుక్ అయిదో స్థానంలో ఉన్నారు. మహిళల్లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లాగార్డేలకు ఈ జాబితాలో స్థానం దక్కింది.