జాతీయ వార్తలు

మరిన్ని పత్రాలు బహిర్గతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: మెట్రోపాలిటన్ నగరాల నుంచి.. ఈశాన్య రాష్ట్రాల్లో మామూలు గ్రామాల వరకు.. అన్ని ప్రాంతాల నుంచి భారతీయుల సంబంధాలు ‘పనామా’తో పెనవేసుకుని పోయాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 1100మంది అధికారులు, వ్యక్తులు, మధ్యవర్తులు.. 828 చిరునామాలు.. 22 కంపెనీలు.. అక్కడక్కడా పరిశీలిస్తేనే దాదాపు రెండువేల భారతీయ లింకులు ‘పనామా’ తాజా వ్యవహారంలో వెలుగుచూశాయి. అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల కన్సార్టియం (ఐసీఐజే) తాజాగా 21 ప్రాంతాలలోకి 2.14లక్షల విదేశీ కంపెనీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన వెబ్‌సైట్ ద్వారా బయట పెట్టింది. ఈ డేటాబేస్‌లో దాదాపు 30వేల డాక్యుమెంట్లు భారత్‌తో సంబంధం ఉన్నవి బయటపడ్డాయి. వీటిలో అక్కడక్కడా పరిశీలిస్తేనే సుమారుగా రెండు వేల భారతీయ లింకులు బయటపడ్డాయి. ఈ పత్రాల ద్వారా లీకైన భారతీయ చిరునామాల్లో మెట్రోపాలిటన్ నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలకు చెందిన చిరునామాలే కాకుండా.. చిన్న నగరాలు, పట్టణాలైన హర్యానాలోని సిర్సా, బిహార్‌లోని ముజఫర్‌పూర్, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, మరో పట్టణం మందసార్‌ల నుంచి కూడా ఉన్నాయి. అంతే కాదు.. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు పట్టణాలకు చెందిన చిరునామాలు కూడా ఈ పత్రాల్లో కనిపించటం విశేషం. పనామా, నెవాడా, హాంగ్‌కాంగ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లలోని పలు కంపెనీలు, సంస్థల్లో పలువురు భారతీయుల సంబంధాలు బయటపడటం గమనార్హం. ఐసీఐజే గత నెలలో పనామా పేపర్ల పేరుతో సుమారు కోటీ 15లక్షల పత్రాలను లీక్ చేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. దేశాధినేతల్లో సైతం గుబులు పుట్టించి అల్లాడించిన సంగతి తెలిసిందే. ‘పనామా పేపర్స్ పరిశోధనలో భాగంగా బయటపడిన ఈ సమాచారం విదేశీ కంపెనీలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, యజమానులకు సంబంధించి విస్తారమైన డేటాబేస్ ఇది. ఈ డేటాబేస్‌లో కొన్ని చట్టబద్ధమైన కంపెనీలు, వ్యక్తులు ఉండవచ్చు. వీరిని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు.’ అని ఐసీఐజే స్పష్టం చేసింది. గత నెలలో లీకైన పత్రాలలో బయటపడిన 500 సంస్థలకు సంబంధించిన సమాచారంపై భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ, ఆర్బీఐ, విదేశీ పన్ను, పన్ను పరిశోధన, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డులతో పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ సాగిస్తోంది. ఈ డేటాబేస్‌లో రహస్య ప్రాంతాల్లోని కంపెనీలు, వాటి యజమానుల వివరాలు మాత్రమే పొందుపరిచారు. వాటికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, ఈమెయిల్ ఎక్స్ఛేంజిల వివరాలను ఇవ్వలేదు.