జాతీయ వార్తలు

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని కేంద్ర సెన్సార్ బోర్డు కార్పొరేషన్ (సిబిఎఫ్‌సి) కొత్త చైర్మన్ ప్రసూన్ జోషీ స్పష్టం చేశారు. ఇంతకుముందు సిబిఎఫ్‌సి చైర్మన్‌గా పనిచేసిన పహ్లాజ్ నిహలానీ అనేక వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. కొంతకాలంగా నిహలానీని తప్పిస్తారని ఊహాగానాలు ఉన్నప్పటికి ఆకస్మాత్తుగా జోషీ నియమితులయ్యారు. ‘నాకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించడానికి శక్తివంతన లేకుండా కృషిచేస్తా. సంస్థ ప్రతిష్టను కాపాడడానికి నిర్మాణాత్మకమైన ప్రాత పోషిస్తాను’ అని కొత్త చైర్మన్ చెప్పారు. అందరి సూచనలు, సలహాలను స్వీకరించి ముందుకు సాగుతానని 45 ఏళ్ల జోషీ అన్నారు. సెంటర్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన మూడేళ్లు పదవిలో ఉంటారని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సిఎఎఫ్‌సిని కేంద్రం పూర్తిగా ప్రక్షాళన చేసింది. కొత్త బోర్డులో విద్యాబాలన్, గౌతమి తాడిమళ్ల, వివేక్ అగ్నిహోత్రి, నరేంద్ర కోహ్లీ, నరేష్ చంద్రాలాల్, నీల్ హెర్బర్ట్ నాంగ్యాన్‌రిచ్, వామన్ కెండ్రే, టిఎస్ నాగాభరణ, రమేశ్ పతంగే, వాణి త్రిపాఠి టికూ, జీవిత రాజశేఖర్, మిహీర్ భుటాలు సభ్యులుగా ఉంటారు. ఉత్తరాఖంఢ్‌లోని అల్మోరాలో జన్మించిన ప్రసూన్ జోషీ ప్రముఖ సినీ రచయిత. రెండుసార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కళలు, సాంస్కృతికాలు, ప్రకటనల రంగానికి సంబంధించి 2015లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. బోర్డులోని కొత్తగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను తీసుకున్నారు.