జాతీయ వార్తలు

సైన్యాన్ని విమర్శించడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, ఆగస్టు 12: సాయుధ దళాలను విమర్శిస్తున్న వారిని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా తప్పుబట్టారు. భద్రతా దళాలను ఇంతగా విమర్శించే దేశం ప్రపంచంలో బహుశా భారత దేశమే అయి ఉంటుందని ఆయన అన్నారు. భద్రతా దళాల త్యాగాల గురించి తెలియనివారే వారిని అనవసరంగా విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిరోజూ వారు తమ ప్రాణాలను పణంగా పెట్టబట్టే మనం ప్రశాంతంగా ఇళ్లలో నిద్ర పోతున్నామని కూడా ఆయన అన్నారు. శనివారం ఇక్కడికి సమీపంలోని వాస్కో వద్ద కోస్ట్ గార్డు నౌక ‘శౌర్య’ జలప్రవేశం చేసిన తర్వాత ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని ఆయన అంటూ మొదట్లో రాజకీయ నేతలు మాత్రమే విమర్శలను ఎదుర్కొనే వారని, ఇప్పుడు ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్, బిఎస్‌ఎఫ్‌లాంటి భద్రతా దళాలు కూడా విమర్శలను ఎదుర్కోవలసి వస్తోందని ఆయన అన్నారు. దురదృష్టశాత్తు మనం ఇప్పుడు భద్రతా దళాల త్యాగాలను అర్థం చేసుకోలేకపోవడం, వారిని గౌరవించలేక పోవడమే దీనికి కారణం కావచ్చని ఆయన అన్నారు.