జాతీయ వార్తలు

బాధ్యులెవరైనా కఠిన చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 12: గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో శిశు మరణాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల మధ్య కేవలం 48 గంటల వ్యవధిలో కనీసం 30 మంది చిన్నారులు మృతి చెందినట్లు గోరఖ్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ రౌటాలా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాలేజీకి చెందిన పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ (చిన్నపిల్లల విభాగం) నివేదికల ప్రకారం ఈ నెల 7వ తేదీనుంచి 63 మంది చిన్నారులు వివిధ వ్యాధుల కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ చెప్పారు. కాగా, బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీలో జరిగిన బాధాకర సంఘటనలకు బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య లక్నోలో విలేఖరులకు చెప్పారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించినట్లు ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి వౌర్య, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి అశుతోష్ టాండన్ శనివారం గోరఖ్‌పూర్ వెళ్లారు. ఆక్సిజన్ కొరత గురించి డాక్టర్లు కానీ, అధికారులు కానీ ముఖ్యమంత్రికి జూలై 9న కానీ, ఈ నెల 9న కానీ తెలియజేయలేదని సిద్ధార్థ్‌నాథ్ సింగ్ చెప్పారు. చివరికి వైద్య విద్యా శాఖ మంత్రికి సైతం తెలియజేయలేదని తెలిపారు.