జాతీయ వార్తలు

పేదలకు బెయిల్ కష్టాలు తగ్గిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: బెయిలు మంజూ రు చేయడానికి ఒకే రకమైన నిబంధనలు ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై జడ్జీలకు ఎలాంటి మార్గదర్శకాలు అవసరం లేదని, అయితే పేదలు ఇబ్బంది పడకుండా ఉండేలా చూ డడం కోసం అవసరమైన మార్గాలను సిఫార్సు చేస్తామని లా కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బిఎస్ చౌహాన్ చెప్పారు. అయితే బెయిలు మంజూరు చేయడానికి జడ్జీలకు మార్గదర్శకాలను సిఫార్సు చేయాలన్న ఆలోచనను తాను పూర్తిగా తిరస్కరించడం లేదని, కమిషన్ ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తుందని చౌహాన్ చెప్పారు. ‘ఒక లాయరుగా, జడ్జిగా నా అనుభవం ఏమిటంటే బెయిలు మంజూరు చేయడం అనేది ఒక కేసుకు సంబంధించిన వాస్తవాల ఆధారంగా కోర్టు విచక్షణకు సంబంధించిన అంశం మాత్రమే... బెయిలు మంజూరు చేయాలా వద్దా, బెయిలుకు అది అర్హమైనదా కాదా అనే విషయంపై కోర్టు అర సెకనులో ఒక నిర్ణయానికి వస్తుంది’ అని 21వ లా కమిషన్‌కు కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన చౌహాన్ పిటిఐకి చెప్పారు. న్యాయ సహాయం, లేదా డబ్బు లేని కారణంగా పేద ప్రజలు బెయిలు పొందలేక పోవడమొక్కటే సమస్య అని ఆయన అన్నారు. ఒక్కోసారి వాళ్లు పూచీకత్తును కూడా తీసుకు రాలేరు. కోర్టు బెయిలు ఇచ్చినా వారు విడుదల కాలేరని అంటూ, ఈ అంశాలపై మాత్రమే ఒక పరిష్కారాన్ని తాము సూచించగలమని ఆయన అంటూ, అయితే జడ్జీకి ఎలాంటి మార్గదర్శకాలు ఉండవని ఒక ప్రత్యేక బెయిలు చట్టాన్ని సిఫార్సు చేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం కమిషన్‌కు సిఫార్సు చేయడాన్ని ప్రస్తావిస్తూ చౌహాన్ అన్నారు. అయితే జడ్జీలకు గైడ్‌లైన్స్‌ను సిఫార్సు చేయడానికి తాము నిరాకరించడం లేదని, ఆ విషయాన్ని అధ్యయనం చేస్తామని ఆయన అంటూ, అయితే అది అవసరమని తాను అనుకోవడం లేదన్నారు. పూచీకత్తు సొమ్మును ఎలా తగ్గించవచ్చు. ఏ పరిస్థితిలో దాన్ని తగ్గించవచ్చు అనే దానిపై కమిషన్ కొన్ని సూచనలు చేయవచ్చని ఆయన చెప్పారు. అయితే బెయిలు పొందిన వ్యక్తి భవిష్యత్తులో కోర్టుకు హాజరు కావడంపై ఏదో ఒక రకమైన గ్యారంటీ ఉండాలని లేని పక్షంలో జనం బెయిలు తీసుకుని అదృశ్యమై పోతారని, అప్పుడు అది ఒక సమస్య అవుతుందని చౌహాన్ అంటూ, బెయిలు పొందడాన్ని సులభతరం చేయడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. ఒక పేదవాడు తప్పక బెయిలు పొందాలని, అదే సమయంలో అతను భవిష్యత్తులో కోర్టుకు తప్పకుండా హాజరయ్యే పరిస్థితి ఉండాలని ఆయన అన్నారు. సిఫార్సులు రూపొందించడానికి ముందు కమిషన్ ఇతర దేశాల చట్టాలను కూడా అధ్యయనం చేస్తుందని చౌహాన్ చెప్పారు.