జాతీయ వార్తలు

నిర్లక్ష్యమే బలిగొంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, ఆగస్టు 18: గోరఖ్‌పూర్ బిఆర్‌డి ఆస్పత్రిలో పిల్లల మరణాలకు ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బృందం తేల్చి చెప్పింది. ఆక్సిజన్ సిలిండర్ల లోటుకు సంబంధించి ఎలాంటి అప్రమత్త హెచ్చరిక ఇవ్వలేదని, వాస్తవానికి అలాంటి పరిస్థితి ఏర్పడితే వారం రోజులు ముందే చెప్పాల్సి ఉంటుందని ఐఎంఎ బృందం తెలిపింది. ఈ నిర్లక్ష్యానికి మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా, బోద వ్యాధి వార్డు ఇన్‌చార్జి కఫిల్ ఖాన్ కారణమని తేల్చిచెప్పింది. అయితే వైద్య పరంగా పూర్తిగా వీరే బాధ్యులు అని చెప్పడానికి గట్టి ఆధారాలు లేకపోయినా, నిర్వహణ పరంగా వీరిపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఐఎంఎ సూచించింది. కమిటీ సమావేశానికి మిశ్రా, ఖాన్‌లతో పాటు ఆస్పత్రి ఎనిస్థీషియా విభాగం అధినేత సతీష్ కుమార్, ప్రధాన సూపరింటెండెంట్ ఎ కె శ్రీవాస్తవలు హాజరుకాలేదు. అక్కడ ఉన్నవారెవరూ మాట్లాడటానికి ముందుకు రావడం లేదని అయితే తమ దర్యాప్తు ఉద్ధేశ్యం వైద్యులు ఏ రకంగా పనిచేస్తున్నారో పరిశీలించడమే తప్ప ఇతర అంశాలు కాదని బృందం తెలిపింది. ఆక్సిజన్ సరిపడా లేకపోవడం , సిబ్బంది కొరత, వసతుల లోపాలను ఉత్తర ప్రదేశ్ ప్రధానకార్యదర్శి నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేస్తోందని వెల్లడించింది.